గుంతలమయంగా భూంపల్లి ఉత్తునూర్ రోడ్డు
కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి ఉత్తనూర్ రోడ్డు మహర్దశ కల్పిస్తామని పాలకులు చెపుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో హమీలు గుప్పించడంతో ప్రజలు ఆ మాటలను నమ్మి ఓట్లు వేసి గెలిపించినా.. ప్రజా ప్రతినిధుల వల్ల తమకు ఒరిగిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంకర తో ఉన్న రోడ్డును బీటీగా మార్చాలని కొన్ని సంవత్సరాలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్ ఎన్నికల ముందు బీటీ రోడ్డు నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ నెరవేరలేదని ప్రజలు అంటున్నారు.
భూంపల్లి మధ్యలో భారీ నీటి కాల్వ ఉంది. ఆ ప్రాంతంలో వంతె న నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. వంతెన లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు వరద ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.