calender_icon.png 3 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఆదేశాలు జిల్లాలో అమలయ్యేనా?

03-03-2025 01:21:12 AM

అధికారులు అక్రమార్కుల దోబూచులాట

అధికారులపై దాడి చేసిన చర్యలు శూన్యం 

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 2 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి తీరంలో ఇసుక అక్రమ రవాణాలో అధికారులు అక్రమార్కులు లోపాయకార ఒప్పందంతో ఉన్నారని కొనసాగుతున్న దందా (ఇసుక మాఫియా) కొన్ని సంఘటనలతో ధ్రువపడుతోంది.

ఇసుక అక్రమ రవాణా నివారణలో అధికారుల తీరు సగటు మనిషి నమ్మేలా అధికార యంత్రాంగం నీళ్లు నమ్ముతుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకే జిల్లాలో దిక్కు ముక్కు లేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో గోదావరి, కిన్నెరసాని  మొర్రేడు నదుల తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగు తోంది.

గత ఆరు నెలలుగా దర్జాగా సాగిన ఇసుక అక్రమ రవాణాకు అధికారుల అండదండలు దండిగా ఉండటంతో రు కోట్ల విలువైన లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తరలించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం తమ విధి కాదు అన్నట్లుగా అధికారులు వ్యవహరించి అక్రమార్కులకు అండగా నిలిచారని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుక అక్రమ రవాణాకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

జిల్లాలో బూర్గంపాడు, ములకలపల్లి, పాల్వంచ ,లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి మండలాల్లో మాత్రం ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడంలో అధికారులు దోబూచులాడుతున్నారని విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి. అడపాదడపా అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాత్రి వేళల్లో అధికారులు సిబ్బందిని కాపలా పెడుతున్నారు.

కొన్ని మండలాల్లో అక్రమార్కులు సిబ్బందిపై దాడులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడం అక్రమార్కులతో అధికారులు దోబూచులాట సాగిస్తున్నారనేటానికి నిదర్శనం గా నిలిచింది. శుక్రవారం పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ చింతల చెరువు సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు లారీల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల నైనా జిల్లాలో అధికారులు పటిష్టంగా అమలు చేస్తారా, నిర్ణీత తో వ్యవహరిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.