calender_icon.png 16 November, 2024 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కోడి ఆస్కార్ తెస్తుందా?

07-11-2024 12:00:00 AM

ఇండియన్ షార్ట్ ఫిలిం ఒకటి ఆస్కార్ బరిలో నిలిచింది. 2025 ఆస్కార్‌కు చిదానంద రూపొందించిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అర్హత సాధించింది. అప్పటి నుంచి ఈ లఘు చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. లైవ్ యాక్షన్ కేటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 16 నిమిషాల నిడివితో ఉంటుంది.

ఓ వృద్ధురాలి కోడిని ఎవరో దొంగిలించడం.. దాని కోసం ఆమె పడే తపన.. చివరకు ఎలా కనుగొందనే విషయాల ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల జరిగిన కేన్స్ ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికవడంతో పాటు.. బెంగుళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఇది మొదటి బహుమతి గెలుచుకుంది.

ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌కే అర్హత సాధించడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా 17 భాషలకు చెందిన లఘు చిత్రాలతో పోటీ పడి ఇది తొలి స్థానంలో నిలవడంతో ఆస్కార్ తప్పక గెలుస్తుందని చిత్ర యూనిట్, భారతీయులంతా ఆశాభావంతో ఉన్నారు. మరి ఆ కోడి ఆస్కార్ తెస్తుందో లేదో చూడాలి.