calender_icon.png 19 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా చేజేతులా..

05-08-2024 12:05:00 AM

కొలంబో: టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియాకు వన్డే సిరీస్‌లో మాత్రం శ్రీలంక షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.  తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫెర్నాండో (62 బంతుల్లో 40), కమిందు మెండిస్ (44 బంతుల్లో 40) రాణించారు. భారత బౌలర్లలో సుందర్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి అర్థసెంచరీతో రాణించాడు. అక్షర్ పటేల్ (44), గిల్ (35) మినహా మిగతావారు విఫలమయ్యారు. లంక బౌలర్లలో జెఫ్రీ వందర్ సే ఆరు వికెట్లు పడగొట్టగా..అసలంక 3 వికెట్లు తీశాడు. టీమిండియా పతనాన్ని శాసించిన వందర్ సే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. తొలి వన్డే టైగా ముగియడంతో మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 1 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే బుధవారం జరగనుంది.