50 మీ రైఫిల్ పొజిషన్ ఫైనల్‌కు అర్హత lనేడు పతక పోరు
ఈసారి ఒలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టాప్ నిలిచిన షూటర్ల మధ్య నేడు మెడల్ రౌండ్ పోటీ జరగనుం ది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో రెండు పతకాలు రాగా.. స్వప్నిల్ కూడా పతకం సాధిస్తే ఈ విభాగంలో హ్యాట్రిక్ పతకాలు మనం సొంతం కానున్నాయి. బుధవారం జరిగిన అర్హత పోరులో స్వప్నిల్ కుసాలే 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచా డు. నీలింగ్ పొజిషన్‌లో 198 (99, 99) పాయింట్లు సాధించిన స్వప్నిల్ ప్రోన్ పొజిషన్‌లో 195 (98, 97) పాయింట్లు సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. తద్వారా ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు క్వాలిఫై అయిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ నిలిచాడు.ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 589 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. లియు యుకున్ (594 పాయింట్లు), జాన్ హెర్మన్ (593 పాయిం ట్లు), సెర్హీ కులిష్ (592 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.