12-02-2025 05:01:20 PM
కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య మృతిచెందగా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య యాదవ్, దౌల్తాబాద్, రాయపోల్ కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు పడాల రాములు, సుధాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు స్వామి, కిష్టారెడ్డి, మల్లేశం, కిషోర్, దుర్గాప్రసాద్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.