calender_icon.png 26 October, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అండగా ఉంటా

26-10-2024 01:17:05 AM

  1. సమస్య పరిష్కారానికి సీఎం, పీసీసీ చీఫ్ చొరవ చూపాలి
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదనను చూసిన తర్వాత తాను చాలా బాధపడుతున్నానని, పార్టీలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డికి తానెప్పుడు అండగా ఉంటానని శుక్రవారం ఒక ప్రకటనలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అధిష్ఠానం కూడా జీవన్‌రెడ్డి అంశానికి తొందరగా పరిష్కారం చూపాల ని, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ప్రత్యే క చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.  జీవన్‌రెడ్డి పార్టీలో ఒంటరి కాదని, సమయం వచ్చినప్పుడు జగ్గారెడ్డి అనే వ్యక్తి అండగా ఉంటాడని తెలిపారు. జీవన్‌రెడ్డి రాజకీయ జీవితమంతా కష్టాలేనని, ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ను జగిత్యాల ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థంకావడం లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను కూడా ప్రజలు ఓడించారన్నారు.