calender_icon.png 5 February, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుదేవులకు వసంతం వచ్చేనా?

02-02-2025 12:00:00 AM

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో తల్లిదండ్రులతో స మానంగా విద్య నేర్పే గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. ‘ఆచార్య దేవోభవ’ అంటూ విద్యాబుద్ధులు నేర్పించే గురువులను దేవుళ్లతో సమానంగా పూజిస్తాం, కీర్తిస్తాం. ఇంట్లో నేర్చుకునే విషయాలకంటే దేవాలయం లాంటి విద్యాలయాల్లోనే ఎక్కువ పరిజ్ఞానం అభ్యసిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు.

భావి పౌరులుగా తయారయ్యే పిల్లల భవిష్యత్తుతో పాటు వారిని సమాజంలో గొప్పవారిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెల కట్టలేనిది. చదువుల తల్లి సరస్వతీదేవీ జన్మించిన రోజు ‘వసంత పంచ మి’ సందర్భంగా చదువులు చెప్పే ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకోవడం సముచితం. విద్య, జ్ఞానం ప్రసాదించే ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో ఉంటే నే సమాజం బాగుంటుంది.

అయి తే, వారు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ జీవన పోరా టం సాగిస్తున్నారు. తెలంగాణ పోరాటం లో సబ్బండ వర్గాలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉపాధ్యాయుల డిమాండ్లు సొంత రాష్ట్రంలో నూ అపరిష్కృతంగానే ఉన్నాయి. బీఆర్‌ఎస్ పాలనతో జీవో 317 తీసుకురా వడంతో ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల్లో అలజడి రేగింది. విసిగి పోయిన ఉపాధ్యాయులకు ఏడాది కాంగ్రె స్ ప్రభుత్వమూ ఎలాంటి ఉపశమనం కల్పించకుం డా మొండిచేయే చూపిస్తున్నది.

కాంగ్రెస్ మానిఫెస్టో ‘అభయ హస్తం’లో ఉపాధ్యాయులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రిక్తహస్తం చూపించింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా సప్లిమెంటరీ బిల్లులను 15 రోజులలో చెల్లించడం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం, జీవో 317 సమీక్షించి బాధిత ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిం చడం, బదిలీలకు క్యాలెండర్ ఏర్పాటు చేసి వేసవి కాలంలో చేపట్టడం,

అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లో సిఫార్సులను అమలు చేయడం, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేయ డం, వారికి పేస్కేలు, ఆరోగ్య భద్రత వంటివెన్నో హామీలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వేలాది ఉపాధ్యాయుల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

దొందూ దొందే అయితే ఎలా?

రెండు పార్టీల పాలన ‘దొందుదొందే’ అన్నట్టుందని ఉపాధ్యాయులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతి తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నీరు గారుస్తున్నది.

ఉపాధ్యాయులు జీవో 317తో స్థానికత కోల్పో యి కుటుంబాలకు దూరమవుతున్నారు. ఈ జీవోకు నిరసనగా ఉపాధ్యాయులు గతం లో రెడ్డెక్కితే, 317 జీవోను సమీక్షిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టించుకో వడం లేదు. అంతేకాదు, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ అమలులో జా ప్యం అవుతు న్నది. వారికి న్యాయంగా రావాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జీపీఎఫ్ చెల్లింపులు కూడా ఆగిపోయాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయక పోవడంతో విద్యాబోధనలో ఇబ్బందులు వస్తున్నాయి.  విద్యా వలంటీర్లను ప్రభుత్వం నియమించనందున బోధనలో సమస్యలు రెట్టింపవుతున్నాయి.

న్యాయమైన ఉపాధ్యాయుల డిమాండ్లు దీర్ఘకాలికంగా పరిష్కారా నికి నోచుకోకపోవడం లేదు. కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, ఎంఈవో, డీఈవో, డైట్, జేఎల్ పోస్టులకు పదోన్నతలు కల్పించాలని, ఇంటర్మీడియెట్ విద్య లో ప్రతి జిల్లాకు డీఈఓ పోస్టు మంజూరు చేసి ప్రమోషన్లు కల్పించాలని, ప్యానల్ ఇయర్, ప్యానల్ సీనియార్టీ జాబితా ప్రకా రం పదోన్నతలు ఇవ్వాలని, గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతలు కల్పించాలని, ప్రభుత్వ సెలవు దినాల్లో గురుకులాల్లో విధు లు

నిర్వహించే సిబ్బందికి వీక్ ఆఫ్ వర్తింపజేయాలని, 12 సంవ త్సరాల సర్వీ సు పూర్తి చేసిన స్కూల్ అసిస్టెంట్లకు, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఎస్జీటీలకు గెజిటెడ్ హోదా కల్పించడం, ఏజెన్సీలలో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు ఏహెచ్‌ఆర్‌ఏ కింద 10 శాతం మూల వేతనం చెల్లించాలని, ఎస్జీటీ, ఎస్‌ఏల మధ్య వేతన అంతరాన్ని తగ్గించేలా ఎస్జీటీల బేసిక్ పేను కొత్త పీఆర్సీలో పెంచాలని, టీచర్లకు హెల్త్ కార్డులను అందించ డంతోపాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని వం టి  డిమాండ్లు పరిష్కారం కావలసి ఉంది.

సమస్యల పద్మవ్యూహం

మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులకు, టీచర్లకే ఉండడంతో వారు విద్యాబోధనకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేక పోతున్నారు. దీంతో సమయానికి సిలబస్ పూర్తి కాకపోవడంతో ఉపాధ్యాయులతోపాటు వి ద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నా రు. ఈ బాధ్యతలకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఆలోచిస్తే పాఠశాలల్లో మెరుగైన పరీక్షా ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి.

మరోవైపు మ ధ్యాహ్న భోజనానికి సరైన ధరలు, బిల్లులు ఇవ్వకుండా వాటిలో లోపాలకూ ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడంపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయులు సమాజ శ్రేయస్సు దృష్ట్యా విద్యా వ్యవస్థ మెరుగు కోసం అనేక సూచనలు, విన్నపాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. విద్యారంగం పై కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన హామీలను అటకెక్కించింది. వాటిలో మచ్చు కు కొన్నింటినీ పరిశీలిస్తే..

తెలంగాణ రాష్ట్రా న్ని దేశంలోనే ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడం, ప్రతి మం డలానికి ఆధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత పాఠశాలల ఏర్పాటు, పాఠ శాలలకు ఉచిత ట్రాన్స్పోర్టు సౌకర్యం ఏర్పా టు, విద్యారంగానికి బడ్జెట్లో నిధుల పెంపు, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ, బీఆర్‌ఎస్ పానలో మూతపడ్డ దాదాపు 6,000 పాఠశాలలను సకల సౌకర్యాలతో తిరిగి ప్రారంభించడం,

ప్రతి హైస్కూల్లో పీఈటీ టీచర్ల నియామకం, కాలేజీలలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్లకు గౌరవ వేతనం రూ.50 వేలుగా సవరించి అమలు చేయ డం, ఉన్నత విద్యామండలిని ప్రక్షాళన చేసి విద్యా ప్రమాణాలు పెంచ డం, ఎయిడెడ్ కళాశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం వంటి అనేక హామీలిచ్చినా కాంగ్రెస్ ప్రభు త్వం వాటి జోలికి వెళ్లడం లేదు.

ఆశలన్నీ కాంగ్రెస్ సర్కారుపైనే

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఒక సభలో మాట్లాడుతూ, తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు. అంతే కాక, ఇప్పుడు విద్యాశాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది. దీంతో తమ సమస్యలపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటారని ఉపాధ్యాయులు ఆశించినా అవి అడియాసలవుతున్నాయి.

తెలంగాణలో పాలకుల నిర్లక్ష్య ధోరణితో విద్యావ్యవస్థతోపాటు ఉపాధ్యాయులు కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నా రు. గత పాలకుల వలె కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. పార్టీ మానిఫెస్టో ‘అభయ హస్తం’లో పేర్కొన్న మేరకు హామీలను అమలుచేస్తూ ఉపాధ్యాయులకు చేయూతనివ్వాలి.