13-02-2025 06:00:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్య ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా సేవ చేస్తానని టిపిటిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ అన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘానికి 36 సంవత్సరాలుగా తాను చేసిన అనేక పోరాటాలను ఉపాధ్యాయ లోకం గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు పనిచేసే అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే సిపిఎస్ రద్దు ఉద్యోగుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి చట్టసభల ద్వారా ప్రభుత్వ విద్య పరిరక్షణకై కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అశోక్ కుమార్, దాసరి శంకర్, గోవర్ధన్, విజయ్ కుమార్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.