calender_icon.png 25 November, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంక్షేమ’ం గాడిలో పడేనా?

29-08-2024 04:25:32 AM

  1. హాస్టల్ వెల్ఫేర్ అధికారులపై లేని నియంత్రణ 
  2. గతంలో పర్యవేక్షణ లేక విద్యార్థులకు ఇక్కట్లు 
  3. జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా ఉమాపతి

నారాయణపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): అధికారుల పర్యవేక్షణాలోపంతో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లాలో హా స్టల్ వెల్ఫేర్ అధికారులపై ఉన్నతాధికారుల నియంత్రణ కొరవడటంతో కొందరు అధికారులు ఆడిందే ఆట అన్నట్టుగా తయారైంది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిగా ఉన్న ఓ అధికారి గత కలెక్టర్‌తో ఉన్న పరిచయాలతో జిల్లా సంక్షేమశాఖకు పూర్తిస్థాయి అధి కారిగా నియామకం అయ్యారు. ఏడాది పా టు విధులు నిర్వర్తించిన సదరు అధికారి చె ప్పిందే వేదం అన్నట్టు పరిస్థితి మారింది. దీ న్ని ఆసరాగా చేసుకుని కొందరు హాస్టల్ వె ల్ఫేర్ అధికారులు తొత్తులుగా మారి ఆ అధికారి చెప్పిందల్లా చేసిపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

విద్యార్థులకు కోత.. అధికారికి మేత

సంక్షేమ వసతి గృహల్లో సాధారణంగా పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు మా త్రమే ఉంటారు. వారికి సరైన వసతులు క ల్పించడం, మెనూ ప్రకారం భోజనం, కూరగాయలు, గుడ్లు, చికెన్‌తో సమతుల ఆహార ం ఇవ్వాల్సిన అధికారులు పట్టించుకోవట్లే దు. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడు తూ.. పై అధికారి ప్రాపకం కోసం మా మూళ్లు సమర్పించుకుంటున్నారని తీవ్ర ఆ రోపణలు ఉన్నాయి. సదరు అధికారిణి బం ధువును ఒప్పంద పద్ధతిలో నైట్ డ్యూటీ వా చ్ మ్యాన్‌గా నియామకం చేశారు. అయితే, సదరు వ్యక్తి ఏ ఒక్క రోజూ విధులు నిర్వహి ంచిన పాపాన పోలేదు. ఏడాదిపాటు జీతం మాత్రం పొందినట్టు ఆ శాఖ అధికారులే చర్చించుకుంటున్నారు. 

తనిఖీలకు రాంరాం

జిల్లాలోని వసతి గృహాల్లో ఏంజరుగుతు ంది? విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నా యా? అని తనిఖీ చేస్తూ విద్యార్థుల యోగక్షేమాలు చూడాల్సిన సదరు అధికారి ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క వసతి గృహాన్ని తని ఖీ చేయలేదని సమాచారం. దీంతో వసతి గృహాలను గాలికి వదిలి సంబంధిత అధికారులు విహార యాత్రలకు వెళ్లిన ఘటనలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్ష ల్లో లంచాలు తీసుకుని ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చినట్టు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మహిళకు మాగనూర్ కేం ద్రంగా వంట మనిషి ఉద్యోగం ఇచ్చి అడిషనల్ కలెక్టర్ ఇంట్లో పని మనిషిగా నియమించి ఆయన మన్ననలు పొందారని తెలిసింది.

ఇకనైనా మారేనా?

ఏఎస్‌డబ్ల్యూవోగా పనిచేస్తున్న ఉమాపతికి జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా ప్రభుత్వ ం బాధ్యతలు అప్పగించింది. సంక్షేమ శాఖపై పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ప్రతి రోజు వసతి గృహాలను తనిఖీ చేస్తున్నట్టు స మాచారం. దీంతో వసతి గృహల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుంద ని, సరిపడా సదుపాయాలు కల్పిస్తారని చ ర్చించుకుంటున్నారు. వసతి గృహల్లో ఏవై నా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నారని అంటున్నారు. తమ సమస్యలు తీరు తుండటంతో వసతి గృహ విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.