ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
కరాచీ: పాకిస్థాన్ వేదికగా వచ్చే నెల జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపి యన్స్ ట్రోఫీ ఆరం భ వేడుకలు ఫిబ్రవ రి 16 లేదా 17న జరపాలని పీసీబీ భావిస్తోంది. అన్ని జట్ల కెప్టెన్లతో ఫోటో షూట్‌కు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఐసీసీని కోరింది. ఈ వేడుకకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరవుతాడా అన్నది ఆసక్తిగా మారింది. ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం కానున్న మెగాటోర్నీలో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇక చాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లను వీక్షించేందుకు టికెట్ రేట్లను ఖరారు చేసింది. టికెట్ ప్రారంభ ధరను 1000 పీకేఆర్‌గా నిర్ణయించింది. భారత కరెన్సీలో రూ.310 మాత్రమే. వీవీఐపీ టికెట్ల ధరను 12వేల పీకేఆర్ (రూ.3,726), సెమీఫైనల్స్‌కు 25వేల పీకేఆర్ (రూ. 7,764)గా నిర్థారించింది. అయితే దుబాయ్ వేదికగా భారత ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ ధరలను నిర్ణయించాల్సి ఉంది.