10-04-2025 02:40:07 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సొంత జిల్లాలో తన పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో, దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరిస్తామని మాట్లాడటం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించా రు.
మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌పై తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని, ఆయన ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలోనూ బీజేపీ చేతిలోనే కాంగ్రెస్ చిత్తుగా ఓడిందని గుర్తుచేశా రు. రేవంత్ పోటీ చేసిన కామారెడ్డితో పాటు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పై బీజేపీదే విజయమని పేర్కొ న్నారు.
హైదరాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థి లేక ఎంఐ ఎం పార్టీకి మద్దతునిచ్చే స్థాయికి దిగజారిపోయిందన్నారు. అయినప్పటికీ అహ్మదాబా ద్‌కు వెళ్లి దేశంలో బీజేపీని నిలువరిస్తామని రేవంత్ మాట్లాడటం చూస్తే నవ్వొస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతరించే స్థితికి చేరుకుందని, భవిష్యత్తు బీజేపీదేనని బండి సంజయ్ వెల్లడించారు.