మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, నవంబర్ 19: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలైనట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు.
హైడ్రా పేరుతో కష్టపడి నిర్మించుకున్న పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయకున్నా మహారాష్ట్రకు వెళ్లి ఎంతో అభివృద్ధి చేసినట్లు, రైతులను ఆదుకున్నట్లు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ విట్టల్, నగర అధ్యక్షుడు శిల్పరాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.