calender_icon.png 1 March, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏనుగు రవీందర్‌రెడ్డికి అవకాశం దక్కేనా..?

01-03-2025 12:37:55 AM

  • ఎమ్మెల్యే పోచారం, రవీందర్‌రెడ్డి వర్గీయుల మధ్య పోరు
  • ఉప ఎన్నికలు వస్తే భాస్కర్‌రెడ్డికి ఛాన్స్...!
  • బాన్సువాడ కాంగ్రెస్ లో సాగుతున్న రసవత్తర రాజకీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కామా రెడ్డి జిల్లా బాన్సు వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందన్న పుకార్లు కామారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.

తెలం గాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఏను గు రవీందర్ రెడ్డి బి.ఆర్.ఎస్ తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుసార్లు ఎన్నికవ్వడంతోపాటు మరో రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లా టిఆర్‌ఎస్ అధ్య క్షులుగా పనిచేసిన రవీందర్ రెడ్డి టిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి సమ యంలో ఎల్లారె డ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

టిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏనుగు రవీందర్ రెడ్డి గట్టి పోటీని ఇచ్చారు. అంతేకాకుండా పాత కాంగ్రెస్ క్యాడర్ అంత పోచారంతో లేకుండా రవీందర్ రెడ్డి తోనే ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం వేధితమే. కానీ అనుచరులందరూ టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరలేదు.

తమకు సమాచారం అందించకుండానే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి తో పాటు మరికొంతమంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటినుంచి బాన్సు వాడ కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీ యు ల మధ్య పోరు కొనసాగుతోంది. చివరికి కేసులు కూడా పెట్టు కు న్న పరిస్థితులు నెలకొన్నాయి.

బాన్సువాడలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చర్చలు జరుగుతుం డడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉప ఎన్ని కల్లో పోటీ చేయకుండా తన కుమారుడు డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అభయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్న తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం తాను ఉప ఎన్నిక జరిగితే పోటీ నుంచి తప్పుకొని తమ కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి నీ పోటీలో నిలిపి గెలిపిస్తానని కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద పోచారం శ్రీనివాస్ రెడ్డి అభయం తీసుకున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.

పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పాత క్యాడర్ తో కలిసి పనిచేస్తున్నాను. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలతో పాటు కాంగ్రెస్ పాత క్యాడర్ మొత్తం ఏనుగు రవీందర్‌రెడ్డికి అండగా నిలుస్తున్నారు.

ఇటీవల నియమించిన మార్కెట్ కమిటీ పదవుల్లో సైతం పోచారం శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకి పెద్దపీట వేయించినప్పటికీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకు జరిగిన అన్యాయం గురించి పార్టీ అధిష్టానం దృష్టికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమ గోడును వెలిబుచ్చారు.

దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి కి ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే రాబోయే బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్న పోచారం భాస్కర్ రెడ్డికి ఎలాంటి అడ్డం కులు ఉండవని భావించి నా పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ఏనుగు రవీందర్ రెడ్డికి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని అధిష్టానం వద్ద తెలిపినట్లు తెలుస్తోంది.

ఏనుగు రవీందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ టికెట్ వస్తే గెలిపిస్తే బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కెసిఆర్ తో అండగా నిలిచి ఉమ్మడి జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షునిగా రవీందర్ రెడ్డి పనిచేసిన సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని టిడిపి నుంచి టిఆర్‌ఎస్ లో చేర్పించేందుకు ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు.

ఏనుగు రవీందర్ రెడ్డి పోచార శ్రీనివాస్ రెడ్డిని టిఆర్‌ఎస్ లో చేర్పించడం వల్లే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం స్పీకర్గా అవకాశం కలిసి వచ్చిందని బాన్సువాడ లోని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీష్టతకు ఎంతో కృషిచేసిన రవీందర్ రెడ్డి సేవలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్  ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేస్తే అనుకూలంగా ఓట్లు పడడమే కాకుండా గెలుపు సునాయాసం కావడమే కాకుండా పార్టీ పటిష్టత కోసం కష్టపడి కృషిచేసిన రవీందర్ రెడ్డి కి సమచిత స్థానం కల్పించాలని ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లాలో ఏనుగు రవీందర్ రెడ్డి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చర్చ జరుగుతుంది. ఈ విషయంపై ఏనుగు రవీందర్ రెడ్డిని విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని చెప్పారు.