calender_icon.png 16 April, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లంతకుంట ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తా

15-04-2025 01:40:50 AM

 మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

 హుజురాబాద్,విజయ క్రాంతి: ఏప్రిల్ 14 :  ఇల్లంతకుంట సీత రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి నా సహాయ సహకారాలు అందిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లోని ఇల్లంద కుంట శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు.

ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట దేవాలయం సీతారామ రాముల వారి బ్రహ్మోత్సవాలు చలువ పందిళ్ళతో ఘనంగా నిర్వహించేదని. ఆలయ అభివృద్ధికి సాయి శక్తుల సహకరిస్తానని. గతంలో ఆలయ అభివృద్ధికి ఎంతో గాను కృషి చేశానన్నారు .

ఈటెల రాకతో ఒక్కసారిగా భక్తులు జై ఈటెల జై ఈటెల అని నినాదాలు చేయడంతో వారికి అభివాదం చేశారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ దేవస్థానం చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, కొమ్మ అశోక్ తో పాటు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.