calender_icon.png 25 February, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు సమస్య తీర్చకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయం

25-02-2025 01:28:00 AM

భీంపూర్ మండల గ్రాడ్యుయేట్ జేఏసీ నేతల వెల్లడి

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో దశబ్ద కాలంగా ఎదురకొంటున్న రోడ్డు సమస్యను తీర్చకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయమని భీంపూర్ మండల గ్రాడ్యుయేట్ జెఏసి సభ్యులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెఏసి కమిటీ సభ్యులు నరేష్ రెడ్డి మాట్లాడారు.

ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న మా ప్రాంత రోడ్డు సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు. రోడ్డు సమస్య తీర్చడం ప్రభుత్వం తో కాకుంటే మా మండలాన్ని పక్క నా ఉన్న మహారాష్ర్ట లో కలపాలని డిమాండ్ చేశారు.

రానున్న రోజుల్లో దశలవారీగా రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. మా గ్రామాల్లో ఏ నాయకున్ని, అధికారుల్ని తిరగనివ్వమని మాకు మేమే స్వయం పాలన చేసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో నితిన్, శైలందర్ యాదవ్, నితిన్ యాదవ్, లతీఫ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.