09-02-2025 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని కేంద్ర హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రాంనగర్ చౌర నుంచి తెలంగాణచౌక్ వరకు ‘పట్టభద్రుల సంకల్పయాత్ర’ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడంవల్ల తెలంగాణలో బీసీలు పోటీచేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదన్నారు. కుల గణన సర్వేలో బీసీ జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సం ఎందుకు స్పందించడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన పెద్ద భోగస్ అని, తెలంగాణలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉంటే జనాభా మాత్రం 3 కోట్ల 70 లక్షల మంది మాత్రమే ఉన్నారని అంటున్నారని తెలిపారు. తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల మంది ఉన్నారని మేధావులు, నిపుణులు, గణాంకాలు చెబుతున్నా మరి 70 లక్షల మంది ఎటు పోయారాని ప్రశ్నించారు.
కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బీసీలు 51 శాతం ఉంటే, రేవంత్‌రెడ్డి కుల గణన సర్వేలో 46 శాతానికి ఎట్లా పడిపోయారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాం మధ్య ఎమ్మెల్సీ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్‌రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటేపల్లి వెంకటర పాల్వాయి హరీశ్‌బు, రామారా పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణ, బీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్‌రావు, మాజీ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యావ్యవస్థ బంధీ
అర్బన్ నక్సల్స్ చేతిలో తెలంగాణ విద్యావ్యవస్థ బంధీగా మా కేం మంత్రి బండి సంజయ్ కుమార్ సం వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్‌లోని ఓ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. బాబా సా అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ ప తాంతియా తోపే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్‌లాగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం అ నక్సల్స్ చేతిలో విద్యావ్యవస్థ బంధీ అయ్యిందన్నారు.
నక్సల్స్ భా జొప్పిం విద్యార్థులను చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారాంరెడ్డి లాగా తయారు చే చూస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశాన్ని సుస్థిరంగా ఉం పెన్నుల రాజ్యంగా మారుస్తుంటే రా ప్రభుత్వం గన్నుల రాజ్యం కావాలని చూస్తోందని విమర్శించారు.