calender_icon.png 9 October, 2024 | 12:48 AM

ముంబై తండ్లాట తీరేనా!

05-10-2024 12:00:00 AM

పటిష్ట స్థితిలో రహానే సేన

ఇరానీ కప్

లక్నో: ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. నేడు ఆటకు ఆఖరి రోజు కావడం.. ముంబై ఆధిక్యంలో ఉండడంతో ఆ జట్టు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

సర్ఫరాజ్ (9*), తనుశ్ కొటియన్ (20*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ముంబై ప్రస్తుతం 274 పరుగుల ముందంజలో ఉంది. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 289/4తో ఇన్నింగ్స్‌ను ఆరం భించిన రెస్టాఫ్ ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (191) తృటిలో డబుల్ సెంచరీ మిస్సవ్వగా.. ధ్రువ్ జురేల్ (93) సెంచరీ చేజార్చుకున్నాడు.

ముంబై బౌలర్లలో తనుశ్, షామ్స్ ములానీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.  నేడు చివరి రోజు కావడంతో మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టమే. ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టును విజేతగా ప్రకటించనున్నారు.