calender_icon.png 21 February, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ గురుకులాలను బీసీగా మారుస్తారా?

16-02-2025 12:25:37 AM

బీజేపీ నేత యెండల 

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): తెలంగాణలో మైనార్టీలను బీసీల్లో కలిపి చూపుతున్న ప్రభు త్వం.. మైనారిటీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకు లాలను బీసీ గురుకులాలుగా మారుస్తుం దా? అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి యెం డల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రధానిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసినవి అత్యంత చౌకబారు వ్యాఖ్యలని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసే పరిస్థితి లేనందునే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.