01-03-2025 12:12:31 AM
కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు లభించని ప్రాధాన్యం
15 నెలలుగా పదవుల కోసం ఎదురుచూపులు
మేడ్చల్, ఫిబ్రవరి 28(విజయ క్రాంతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన నాయకులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 5 ఎమ్మెల్సీ పద వులలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నాయకులకు భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. గతంలో హామీ ఇచ్చినందున ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి మేడ్చల్ టికెట్ పై ఆశలు పెట్టుకోగా, వజ్రెష్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజ కవర్గంలో నర్సారెడ్డి భూపతిరెడ్డి టికెట్ ఆశించగా, వేరే పార్టీ నుండి వచ్చిన కొలను హనుమంత రెడ్డికి టికెట్ ఇచ్చారు. వీరిద్దరికీ భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరిద్దరూ మేడ్చల్, కుతుబుల్లాపూర్ నియోజకవర్గాలలో బలమైన నాయ కులు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో దా నం నాగేందర్‌కు ఇవ్వడంతో రామ్మోహన్ అసంతృప్తికి గురయ్యా రు. ప్రస్తుతం బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలకు కూడా అవకాశం ఇస్తే మైనంపల్లి హనుమంతరావు, వజ్రెష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ పదవి కోరే అవకాశం ఉంది. జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు లేనందున ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే!
నామినేటెడ్ పదవుల్లోనూ దక్కని ప్రాధాన్యం
రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల పరిధిలోను జిల్లాకు ప్రాధాన్యం లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 40 కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది. విద్యా కమిషన్ మెంబర్ మినహా జిల్లా నాయకులకు పదవులు లభించలేదు.
పదవుల కోసం ఎదురుచూపులు
కాంగ్రెస్ పార్టీ లో నాయకులు పదవుల కోసం 15 నెలలుగా ఎదురుచూ స్తున్నారు. ఏదో ఒక పదవి రాదా అనే ఆశాభావంతో ఉన్నారు. అధికారంలో ఉన్నందున ఏదో ఒక పదవి ఉండాలనే భావనతో ఉన్నారు. ఏదో ఒక పదవి ఉంటే తాము ఫలానా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పిసిసి కార్యవర్గం త్వరలో విస్తరించనున్నారు. కార్యవర్గం జాబితాను ఏఐసీ సీ ఆమోదం కోసం పంపారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటును కొంతమంది నాయకులు ఆశిస్తున్నారు.