calender_icon.png 20 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాక్ నిలబెడుతుందా?

27-03-2025 12:00:00 AM

రీల్స్ పుణ్యమా, యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్ పుణ్యమా అని చాలా మంది నటీనటులు అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడంతో పాటు సోషల్ మీడియాఇన్‌ఫ్లూయన్సర్‌గా తొలుత వైష్ణవి చైతన్య పాపులర్ అయ్యింది. ఆ తరువాత మెల్లగా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. ‘టచ్ చేసి చూడు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.

ఆ తరువాత ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రంతో కావల్సినంత హేట్రేట్‌ను కొనితెచ్చుకుంది. కానీ ఇదంతా ముందుగానే ఊహించినది కావడంతో దానిని పెద్దగా పట్టించుకోకుండా కెరీర్‌లో నిలదొక్కుకోవడంపైనే ఫోకస్ పెట్టింది. అలా తిరిగి ‘బేబి’ నిర్మాతతోనే మరో రెండు ప్రాజెక్టులు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆ తరువాత ఆమె నటించిన ‘లవ్ మీ’ చిత్రం డిజాస్టర్ కావడంతో కెరీర్ కష్టాల్లో పడిపోయింది.

‘బేబీ’ నిర్మాతతో సినిమా అనుకుంటే అది కూడా వర్కవుట్ కాలేదు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ సిద్దు జొన్నలగడ్డతో కలిసి ‘జాక్’ చిత్రం చేస్తోంది. అలాగే ఆనంద్ దేవరకొండతో ఒక మూవీకి కమిట్ అయ్యింది. సిద్దుతో చేస్తున్న సినిమా సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మకు కెరీర్.. లేదంటే కష్టమేనని టాక్. ‘జాక్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..