calender_icon.png 23 December, 2024 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా ప్రీమియం పన్ను తగ్గిస్తారా?

21-12-2024 12:21:17 AM

* నేడు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జీవిత, సాధార ణ బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను తగ్గిం పు, ప్రీమియం వాచీలు, పాదరక్షలు, రెడీమేడ్ దుస్తులపై పన్ను పెంపు తదితర ప్రతిపాదన లపై శనివారం జరిగే జీఎస్టీ కౌన్సి ల్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే సిగరెట్లు, కార్పొనేటెడ్ శీతల పానీయాల కోసం ప్రత్యేకంగా 35శాతం జీఎస్టీ పన్ను శ్లాబ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సైతం కౌన్సిల్ పరిశీలిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్య క్షతన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొనే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దాదాపు 148 ఐటెమ్స్‌పై పన్ను రేట్ల మార్పులను చర్చిస్తుంది. అలాగే విమా నయాన ఇంధనం ఏటీఎఫ్‌ను వస్తు సేవల పన్ను పరిధిలోకి చేర్చే అంశంపై సైతం కసరత్తు చేస్తుంది. 

పన్ను ప్రతిపాదనలివి

ఈ కౌన్సిల్ సమావేశపు అజెండాలో ఉన్న అంశాల్లో ముఖ్యమైన జీవిత, సాధార ణ బీమాలపై పన్ను రేటుపై నిర్ణయం తీసు కుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీమా ప్రీమియంపై జీఎస్టీ ప్రతిపాదన కోసం బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో కౌన్సిల్ నియమించిన మంత్రుల కమిటీ ఇప్పటికే జీవిత బీమా టెర్మ్ పాలసీల ప్రీమియం  జీఎస్టీ నుంచి మినహాయించాలని సిఫార్సుచేసింది. అలాగే సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయిం పును కూడా మంత్రుల కమిటీ ప్రతిపాదిం చింది. అలాగే సీనియర్ సిటిజన్లు కాని సాధారణ పౌరులు రూ.5 లక్షల కవరేజ్ వరకూ తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీపై పన్ను మినహాయింపును సిఫార్సు చేసింది. అయితే రూ.5 లక్షలకుపైబడి కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపులపై 18 శాతం జీఎస్టీని కొనసా గించాలని ప్రతిపాదించింది. 

ఫుడ్ డెలివరీపై పన్ను తగ్గించే యోచన

స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివ రీ ప్లాట్‌ఫామ్స్‌పై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో కలిసి) 5 శాతానికి (ఐటీసీ లేకుండా) తగ్గించాలన్న ప్రతిపాదన కూడా కౌన్సిల్ ముందు ఉన్నది. యూజ్డ్ ఎలక్ట్రిక్ వాహ నాలు (ఈవీలు), చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం పన్నును 18 శాతానికి పెంచా లంటూ ఫిట్‌మెంట్ కమిటీ (కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులతో కూడిన) ప్రతిపాదనను కూడా కౌన్సిల్ ముందు ఉంచవచ్చని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ పెంపుతో పాత పెద్ద వాహనాల తో సమానంగా యూజ్డ్, చిన్న కార్ల పన్ను సమానం అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి.