calender_icon.png 17 March, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తా

17-03-2025 01:42:45 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్, మార్చి 16 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ హయాం లో పూర్తయిన పార్కులను ఇప్పటివరకు ప్రారంభించలేదని, కాంగ్రెస్ నాయకులకు మాటలు తప్పా పనులకు పనికిరారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హయత్ నగర్ డివిజన్ లోని కమర్షియల్ టాక్స్ కాలనీలో జైహింద్ పార్కు వద్ద ఆదివారం స్థానికులతో సమావేశమయ్యారు.

ముందుగా ఆయా కాలనీల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్థానికులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.  బ్లడ్ బ్యాంక్ కాలనీ, సీటీవో కాలనీ, ఖాది బోర్డు కాలనీ, కమర్షియల్ టాక్స్ కాలనీ, వాసవి కాలనీల సంఘాల నాయకులు సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఆయా కాలనీల్లో డ్రైనేజీ ఔట్ లేట్ లేకపోవడంతో మురుగునీరు మొత్తం రోడ్ల మీద పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.

మంచినీటి సౌకర్యం, సీసీరోడ్లు, కరెంటు స్తంభాలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమర్షియల్ కాలనీలో జైహింద్ పార్క్ పూర్తయి దాదాపు సంవత్సరం గడిచినా ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ నాయకుల పోరాటంతోనే పార్కులను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

డ్రైన్స్ నిర్మించాక మంచినీటి పైప్ లైన్లు, రోడ్లు నిర్మిస్తామన్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మాజీ అధ్యక్షులు.

మల్లేశ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మల్లీశ్వరి రెడ్డి, భాస్కర్ సాగర్, గుజ్జ జగన్మోహన్, పరమేశ్, యనాల కృష్ణ రెడ్డి, స్కైలాబ్, నగేశ్, లక్ష్మణ్, సందీప్, మనోజ్, వివిధ కాలనీల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, గణేశ్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.