calender_icon.png 13 March, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుపాయాలు కల్పిస్తా..

13-03-2025 01:01:03 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, మార్చి 12: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు కాలనీల్లో ప్రజలకు కనీస, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించి, సుమారు రూ. 71 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  సరస్వతీ నగర్ కాలనీలో నీటి స్తబ్దత తొలగింపు, సీసీరోడ్లు పనులు, టీ నగర్‌లో సీసీరోడ్డ, వీరన్న గుట్ట కాలనీలో నూతన ఓపెన్ జిమ్ ఏర్పాటు, వీరన్న గుట్ట కాలనీ పోచమ్మ దేవాలయం దగ్గర సీసీ రోడ్డు, విజయ్ నగర్ కాలనీలో కమాన్ నుంచి సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు.. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివం హిల్స్, దుర్గాభవని నగర్, వీరన్నగుట్ట కాలనీల్లో మరికొన్ని డ్రైన్స్, సీసీరోడ్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు.   కాలనీల్లో మంచినీటి, విద్యుత్ సమస్యలు నెలకొన్నాయని, వీటిని త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. రాబోయే వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. చట్టబద్ధంగా ఇండ్లు కట్టుకునేవారు ఎవరికి భయపడొద్దని,  ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. 

నేషనల్ హైవేపై ప్రజల అభిప్రాయాల మేరకు యూ టర్న్ నిర్మించాలని అధికారులను కోరారు. స్వాతి రెసిడెన్సీ దగ్గర ట్రంక్ లైన్ ఔట్ లెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి రెవెన్యూ అధికారులను పిలిపించి మాట్లాడుతానని తెలిపారు.  కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, నాయకులు కోసనం వెంకట్ రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి, అనిల్ కుమార్, కేకేఎల్ గౌడ్, ఆనంద్ యాదవ్, నర్సింగ్ రావు, కుమార్, మహే శ్, భాస్కర్, బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.