calender_icon.png 3 November, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్ ఆతిథ్యం భారత్‌కు దక్కేనా?

22-06-2024 02:34:17 AM

న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సాయ్ ఆధ్వర్యంలోని భారత మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ).. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎదుట గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మిషన్ ఒలింపిక్ సెల్.. ఐవోసీకి ప్రత్యేక బిడ్ అందజేయాలని భావిస్తోంది. విశ్వక్రీడల్లో క్రికెట్, ఖోఖో, కబడ్డీ సహా ఆరు క్రీడలకు చోటు కల్పించాలంటూ ప్రత్యేక రిపోర్టును తయారు చేసింది. కాగా గురువారం ఎంవోసీ బృందం తమ రిపోర్టును క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయాకు సమర్పించింది.

రిపోర్టులో 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, టీ20 క్రికెట్, స్వాష్ క్రీడలకు అనుమతి కల్పించాలని కోరింది. కాగా గతేడాది ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ఖతార్, సౌదీ అరేబియా, చైనా, హంగేరి, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, కెనడా, స్పెయిన్, బ్రిటన్, పోలండ్, మెక్సికో, దక్షిణ కొరియా, ఈజిప్ట్, చిలీ, టర్కీ, ఇండోనేషియాలతో పోటీ పడాల్సి ఉంది.