21-02-2025 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గం లోని మంజీరా వాగు నుంచి ఇసుక మాఫీ యా చేస్తున్న ఇసుక దందాకు చెక్ పెట్టేందుకు జుక్కల్ నియోజకవర్గంలోని కొందరు యువకులు నడుం బిగించారు.
భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నియోజకవర్గంలోని రైతులకు భవిష్యత్తులో సాగు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రైతుల పక్షాన హైకోర్టును ఆశ్రయించాలని కొంతమంది యువకులు గురువారం జిల్లా కోర్టుకు వచ్చి న్యాయవాది నారాయణ ను కలిసి అక్రమ ఇసుక దందాకు చెక్ పడేలా చేయాలనే నిర్ణయంతో కొంతమంది జుక్కల్ నియోజక వర్గంలోని యువకులు హైకోర్టును ఆశ్రయించాలని ఆలోచనలో ఉన్నారు.
గతంలో ప్రభుత్వం నుంచి ఇసుక క్వారీలకు అనుమతులు పొంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నలభై కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారని బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం విధితమే.
కొంతమంది రాజకీయ పలుకుబడి గల నేతల ప్రోత్సాహంతో అక్రమ ఇసుక దందా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండికోటి 40 కోట్ల విలువచేసి అక్రమ ఇసుకను తరలించారని హైకోర్టులో పిటిషన్ వేయడంతో అధికారులు ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రభుత్వం ఇచ్చిన ఇసుక రీచ్ లను రద్దు చేశారు. నిబంధనలు తుంగలో తోక్కారని వారి లైసెన్సులను రద్దు చేశారు.
అప్పటినుండి ప్రభుత్వపరంగా బ్రేక్ వేసినప్పటికీ ఇసుక మాఫియా కు మాత్రం మంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా తరలించడం మాత్రం మానుకోలేదు. ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ రాత్రి వేళలో ఇసుక దందాను కొనసాగిస్తూ ప్రతిరోజు అందాల సంఖ్యలో ట్రాక్టర్లు టిప్పర్రు సహాయంతో పోలీసులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నిరభ్యంతరంగా అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు.
అక్రమ ఇసుక దందాలను అరికట్టేందుకు ఉమ్మడి జిల్లాల సబ్ కలెక్టర్లు రెవిన్యూ పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులు ఆండా దండతో అక్రమ ఇసుక దందాను ఇసుక మాఫియా నేటికీ కొనసాగిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్లు ఇసుక అక్రమ దందాలను అరికట్టాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద హంగార్గా సిరుపూర్. పొతంగల్ కోటగిరి డోన్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇసుక డంపులు రాత్రి వేళలో ఏర్పాటుచేసి ఉదయం అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఇసుక దందాలు ఇసుక మాఫియా యదేచ్చగా కొనసాగిస్తున్నారు.
దీంతో అందరు యువకులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని జిల్లా కేంద్రంలోని మైన్స్ అధికారులను జిల్లా కేంద్రంలోని కొందరు న్యాయవాదులను కలిసి అక్రమ ఇసుక దందాలను అరికట్టేందుకు హైకోర్టు నాశ్రయించాలని సలహాలు తీసుకున్నారు. త్వరలోనే మంజీరా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా ను అరికట్టాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు.
ఇకనైనా అక్రమ ఇసుక దందాకు బ్రేక్ ప డేనా వేచి చూడాల్సిందే. జుక్కల్ నియోజకవర్గం లోని యువకుల న్యాయపోరాటం ఫలిస్తుందా లేదా అనడానికి మంజీరా నది నుంచి ఆక్రమ ఇసుక రవాణాకు బ్రేకు పడుతుందా లేద వేచి చూడాల్సిందే మరి.