- బఫర్ జోన్‌లో దర్జాగా నిర్మాణాలు
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
అక్రమ నిర్మాణాల నివేదిక ఇవ్వాలని వార్డ్ ఆఫీసర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి) : నేటి బాలలు రేపటి పౌరులని ఎంతోమంది మహనీయులు నిత్యం చెబు తున్న మాట. నేటి నిర్మిస్తున్న అక్రమ నిర్మా ణాలు, సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న భవనాలతో భవిష్యత్ తరాలకు ఎన్ని ఇబ్బం దులు తెచ్చి పెడతాయో ఇటు అధికారులు, అటు నిర్మాణదారులు ఎందుకు ఆలోచించ డం లేదోహొ అర్థం కాని ప్రశ్నలా మిగిలిపో తుంది.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజ యేందిర బోయి సంబంధిత అధికారులకు పక్కాగా అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వా లని ఆదేశించారు. ఏళ్ల తరబడి ఈ సమస్యహొ మహబూబ్ నగర్ మున్సిపా లిటీని వేధిస్తుంది. ప్రభుత్వాలు మారిన అధికారులు స్థానచరణమైన అక్రమ నిర్మా ణదారులకు మామాత్రంధికారులు వత్తాసు పలుకుతూనే వస్తుండ్రు అనే ఆరోపణలకు మరింత పదును చేకూరుతుంది.
కుర్చీలకే పరిమితమైన అధికారులు...
పట్టణ పురోగతి ని పరిశీలిస్తూ ఎక్కడ ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి.. ఆ నిర్మాణా ల ద్వారా పట్టణ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఇబ్బందులను గుర్తించి సక్రమం చేసేందుకు అధికారులకు బాధ్యతలు ఇచ్చిన అధికారులు మాత్రం కుర్చీలకే పరిమితమై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. వాడు వార్డుకు ప్రస్తుతం వార్డ్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణంలో ఆపడంలో మాత్రం పాలమూరు కార్పొరేషన్ వెనకంజ వేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది.
ఆపేదెవరు...?
నియమ నిబంధనలు పాటించి నిర్మాణా లు చేపడితే వారి బిడ్డల భవిష్యత్తుతో పాటు వారి భవిష్యత్తు ఆ ఇంటిలో ఎంతో సౌకర్యం గా ఉంటుంది. సెట్ బ్యాక్ లేకుండా, తక్కువ అనుమతులు పొంది ఎక్కువ నిర్మా ణాలు చేపడుతూ ముందుకు సాగితే వారి జీవితాం తం అధికారులకు భయపడవలసిం దే. ఎప్పుడు ఎవరు వచ్చి కూల్చివేసిన... చెప్పుకునే నాథుడే కరవయ్యే పరిస్థితి భవిష్య త్తులో ఎదుర్కోక తప్పదు.
ఇకనైనా నిర్మాణ దారులు వారు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణా లపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలోని పాన్ చౌరస్తా సమీపం లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణంలో జోరుగా సాగుతున్నాయి.
పాత పాలమూర్ లో పెద్ద కాలువ పక్కన బఫర్ జోన్ పరిధిలోనే పెద్ద ఎత్తున భవనం నిర్మాణం జరుగుతుంది. కలెక్టరేట్ ముందు 272 సర్వేనెంబర్ నందు విద్యుత్ హై టెన్షన్ లైన్ ఉంది. అయినప్పటికీ నిర్మాణ పనులు చేసేందుకు అవసరమైన చర్యలు నిర్మాణదా రులు తీసుకుంటున్నారు. ఇలా పట్టణంలో అక్రమ నిర్మాణాలు యాదేచ్ఛంగా జరుగు తున్నాయి.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
పాతపాలమూర్ దగ్గర పెద్ద కాల్వ పక్కన నిబంధనల మేరకు స్థలంను వదిలి నిర్మా ణాలు చేపట్టిన యెడల నిర్మాణదారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలపై పరిశీలిస్తాం. మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం మాకు తెలియదు. అన్ని విషయాలను పరిశీలిస్తాం.
-వెంకటయ్య, నీటిపారుదల శాఖ, ఈఈ