calender_icon.png 26 April, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన కోసమే నా పొగరే అణిగేనా..

26-04-2025 12:00:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్ పాటలతో ఇప్పటికే ఈ సినిమా విశేష స్పందన పొందుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘తను’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ‘తన కోసమే నా పొగరే మరి అణిగేనా..

తన కోసమే పరుగే ఇక ఆగేనా.. తనతోనే లోకమా.. తనతోనే ప్రేమా.. తనతోనేనా.. తను నాదేనా.. నిజమా తను నా నీడేనా..’ అంటూ సాగుతోందీ పాట. రొమాంటిక్, ఇంటెన్స్‌తో కూడిన ఈ పాటను ఒకే టేక్‌లో షూట్ చేయడం విశేషం.

మిక్కీ జే మేయర్ స్వరకల్పన చేసిన ఈ పాట కోసం రాఘవ్ రాసిన సాహిత్యం, అనిరుధ్ రవిచందర్ గాత్రం.. నాని పాత్రలోని బలమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమాకు డీవోపీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జే మేయర్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.