16-02-2025 12:06:10 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): దళితులు, గిరిజనులను దూషించడం, వారిపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారం, హత్య లాంటి కేసుల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతా 2016లో విడుదలైన జీవో నెం 29 ప్రకారం అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహకా అందిస్తోంది.
కానీ రెండేండ్లుగా బా ఆ పరిహారం అందడం లేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ హైదరాబాద్ సహా వివిధ జిల్లాలోని బాధితులకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన పరి అందడం లేదు. దీంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
గతేడాది 183 కేసులు నమోదు
హైదరాబాద్ జిల్లాలో 2024లో 183 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న వాటిలో 128 కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. మరో 55 ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకుపై దాడి, దౌర్జన్యం జరిగిన రోజు నుంచి 60 రోజుల్లోగా కేసు నమోదు చేసి బాధితులకు భరోసాగా నిలవాలి.
కేసు నమోదైనప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు దఫాల వారీగా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేసును బట్టి రూ.8 లక్షల వరకు పరిహారం అందుతుంది. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 300 మంది బాధితులకు రూ.2.18 కోట్ల నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సిఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.