03-03-2025 12:59:43 AM
కోలీవుడ్ స్టార్ విక్రమ్ కథానాయకుడిగా గౌత మ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘ధ్రువనక్షత్రం’. ఈ చిత్రాన్ని మొదట 2017లో ప్రకటించారు. చిత్రీకరణ కూడా ఎప్పుడో పూర్తయ్యింది. పలుమార్లు విడుదల తేదీలు ప్రకటిస్తూ, వాయిదా వేస్తూ వచ్చిన మేకర్స్ మరోమారు తాజా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
ఈ ఏడాది మే 1న సినిమా ను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈసారైనా రిలీజ్ చేస్తారో లేదోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీప్రియులు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ అంశం సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మే 1న పార్ట్ విడుదల చేసి, ఆ వెంటనే రెండో భాగాన్ని సైతం రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట. ఈ సారైనా ఈ సినిమా వాయిదా పడకుంటా ఉంటుందా? చూడాలి.