02-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా సెంట్రల్ యునివర్సిటీ కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు కబ్జాకు గురి అవుతుంటే రాష్ట్రంలో చెరువులు కాపాడుతానని ప్రతిజ్ఞ బూనిన హైడ్రా రంగనాద్ ఏం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుదాకర్ ప్రశ్నించారు.
కోట్లాది రూపాయల విలువైన ఈ 400 ఎకరాలలో అడవితో పాటు 3 చెరువులు పీకాక్ లేక్, బఫెల్లో లేకే, క్రేన్ లేక్ లు వున్నాయని, అంటే ఈ నలుగు వందల ఎకరాలు బఫర్ జోన్ లోకి వస్తాయని, అంగుళం స్తలం కూడా బఫర్ జోన్ లో వుంటే వదలం అని చెప్పే రంగనాద్ ఏం చేస్తున్నారని డాక్టర్ దిడ్డి సుదాకర్ మం గళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్య క్తం చేశారు.
అనేక రకాల జంతువులకు, పక్షులకు నిల యమైన ఈ భూములపై ప్రభుత్వం బెషజాలకు పోకుండా తక్షణం, హెచ్‌సీయూ విద్యా ర్ధి సంఘాల నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు.
కాంక్రీట్ నగరంగా మారిపోతున్న హైదరాబాద్ మహా నగరంలో ఆక్సిజన్ అందిస్తున్న పెద్ద పార్కును నష్ట పరచకుండా, ఇపుడు ప్రభు త్వం ప్రతిష్టాకరంగా ప్రకటించిన వేల ఎకరాలలో నిర్మించ దలచిన ఫ్యూచర్ సిటీలో ఈ ఐటీ హబ్‌ని నిర్మించాలని కోరారు. ప్రభు త్వం కాదని హెచ్‌సీయూ భూములను ఆక్రమిస్తామని, నిర్మాణం చేస్తామని మొండి పట్టు పడితే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని డాక్టర్ దిడ్డి సుదాకర్ హెచ్చరించారు.