calender_icon.png 1 March, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలు ఆవిరేనా?

01-03-2025 01:04:30 AM

  1. మూడు మీటర్ల కింద శరీర భాగాలు?
  2. జీపీఆర్ సాంకేతికతతో గుర్తింపు.. ఐదు చోట్ల మార్కింగ్
  3. సంయమనం పాటించాలన్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోశ్

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం విషాదాంతంగా ముగియనున్నట్టు తెలుస్తుం ది. ఈ మేరకు రెస్క్యూ టీమ్ బృందాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. సొరంగంలో మూడు మీటర్ల కింద శరీర భాగాలు ఉన్నట్టుగా గుర్తించి దాదాపు ఐదు చోట్ల మార్కింగ్ చేయడంతో కార్మికుల ప్రాణాలపై పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి.

అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, అప్పటివరకు సంయమనం పాటించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోశ్ మీడి యాను కోరారు. ఫిబ్రవరి 22న ఉదయం 8:30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు టీబీఎం మిషన్ ఆపరేటర్లు సహా మరో నలుగురు కార్మికులు గల్లంతయ్యారు. అప్పటినుంచి సుమారు 11 రకాల సహా య బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

టన్నెల్‌లో 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగ్గా భారీగా నీటి ఊట, బురద దిబ్బలు కూలి పడటంతో కేవలం 12 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్‌లో ప్రయాణం చేసి అక్కడ రెస్క్యూ టీం ఐదు రోజులపాటు పరిశీలించింది. సహాయక పనులు ముందుకు సాగకపోవడంతో టన్నెల్ బోరింగ్ మిషన్‌ను పూర్తిగా కట్ చేసి వాటి శకలాలను తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యల్లో వేగం పెరిగింది. శుక్రవారం సాయంత్రం గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా సొరంగం స్కా నింగ్ చేస్తుండగా.. ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్టు రెస్క్యూ టీం గు ర్తించింది.  టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించిన సహాయ సి బ్బంది.. చిక్కుకున్న వాళ్లు అక్కడే ఉన్నట్టుగా భావిస్తున్నారు.

మెత్తటి భాగాలు మానవ అవశేషాలే అయి తే మరో ముగ్గురు కార్మికుల జాడ తెలియాల్సి ఉంటుంది. టీబీఎం మిషన్ అంతర్భాగంలో రెండు ఫో ర్లు ఉంటాయని ఆ ప్రాంతంలో మిగిలిన ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉంటారేమో అనే ఉద్దేశంతో భారీ కట్టర్ల సహాయంతో ఆ మిషన్‌ను క ట్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం గు ర్తించిన ఐదు ప్రాంతాల్లో కూడా మూడు మీటర్ల మేర తవ్వేందుకు సహాయ సిబ్బందికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం 10వేల క్యూబిక్ మీటర్ల బురదను తొలగించాల్సి ఉండగా.. లోకో ట్రైన్ సౌకర్యం కేవలం 12 కిలోమీటర్ల వర కే అందుబాటులో ఉండటంతో బు రదను తొలగించడంలో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. 

టన్నెల్లోని నీటి ఊట సమస్యను అధిగమించేందుకు డీ వాటరింగ్ చేస్తూ రెస్క్యూ సిబ్బంది బురదను బయటకు తోడే ందుకు ౩ షిఫ్టుల్లో పని చేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి సంస్థ సీఎండీ బలరాం.. కార్మికుల జాడ గుర్తించేందుకు ఇంకొంత సమయం పడుతున్నారు.