- భారత్‌కు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సూటి ప్రశ్న
- ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇప్పటికే పలుమార్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కోరినప్పటికీ భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారుడు తౌహీద్ హుస్సేన్, బీఎన్‌పీ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ.. హసీనాను అప్పగించాలని, భారత్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకా శాలు ఉన్నాయని అన్నారు.
‘మేం తలచ్చుకుంటే మా న్యాయవ్యవస్థ ద్వారా ఆమెను తిరిగి బంగ్లాకు రప్పించగలం. అయితే భారత్‌తో అనేక రకాల వ్యాపార, దౌత్య ఒప్పందాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మేం ఇప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అనుకోవడం లేదు’ అని తెలిపారు.
హసీనాయే కారణం
హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల అక్కడి యువత పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో హసీనా ప్రధా ని పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశం విడిచారు. హసీనా హయాంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు హసీనాయే కారణమంటూ పలు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఆమెను అరెస్టు చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.