నేడు భారత్, విండీస్ తొలి వన్డే
వడోదర: స్వదేశంలో టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ విజయంపై కన్నేసింది. వడోదర వేదికగా నేడు ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూ విండీస్‌తో చివరి రెండు టీ20లకు దూరంగా ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే సిరీస్‌లో ఆడనుందా లేదన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ హర్మన్ ఆడకపోతే స్మృతి మంధాన మరోసారి జట్టును నడిపించనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన చివరి 10 వన్డేల్లో 599 పరుగులు సాధించింది. మంధాన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉంది. బౌలింగ్‌లో పేసర్ టిటాస్ సాధు ఆకట్టుకుంటుండగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చివరి 10 వన్డేల్లో 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా.. రేణుకా, సైమా ఠాకోర్ కీలకం కానున్నారు. మరోవైపు టీ20 సిరీస్ కోల్పోయిన విండీస్ వన్డేల్లో మాత్రం గెలవాలనే పట్టుదలతో ఉంది. గతంలో 2017లో విండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 4 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.