calender_icon.png 19 March, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘాటి అనుకున్న సమయానికే వస్తుందా?

19-03-2025 12:00:00 AM

ఏదైనా సినిమా హిట్ పడిందంటే హీరోయిన్స్‌ను పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ‘బాహుబలి’ వంటి పెద్ద హిట్ పడితే మరో హీరోయిన్ అయితే ఓ రేంజ్‌లో బిజీ అయిపోయి నానా హడావుడి చేసేది. మరి అనుష్క శెట్టికి ఏమైందో ఏమో కానీ డెడ్ స్లో అయిపోయింది. వాస్తవానికి అనుష్క ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుని మరీ చేస్తోంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన అనుష్క.. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. మధ్యలో అంటే.. 2023లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ‘ఘాటి’ ఒక్కదాన్ని ప్రకటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘వేదం’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో అనుష్క చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

తమిళ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మేలో రిలీజ్‌కు వస్తున్న చిత్రాల ప్రమోషన్స్ ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. ‘ఘాటి’కి మాత్రం ప్రమోషన్సే లేవు. దీనికి సంబంధించి టీజర్, ఒకట్రెండు పోస్టర్స్ మినహీ ప్రమోషన్స్ విషయంలో అతీగతీ లేదు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందా? అంటూ ప్రచారం జరుగుతోంది.