కరీంనగర్ (విజయక్రాంతి): చట్టసభలలో పట్టభద్రుల ప్రాతినిధ్యానికై ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించారు. కానీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు పట్టభద్రుల సమస్యల సాధనకై పాటుపడుట లేదా పోరాటం చేసుటకు బదులుగా ఎన్నికైన సభ్యులు వారి వారి ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ పట్టభద్రుల సమస్యలను విస్మరిస్తున్నారని ఈ రోజు కరీంనగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సుగుణాకర్ రావు అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన లేకుండా యువతి యువకులు నిరుద్యోగులుగ ఉన్నారని ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్ లిస్టు లాంటి అనేక మంది పట్టభద్రుల సమస్యలపై ఎన్నికైన వారు చివరికి చట్టసభలలో కూడా మాట్లాడతలేరని సుగుణాకర్ రావు అన్నారు. తనకు అవకాశం ఇస్తే పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పాటుపడతానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలల అయినప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలుపరచలేదని అన్నారు. రైతులను శత్రువులుగా చూస్తున్నారని అన్నారు. రైతుల పండించిన పంట కొనుగోలు చేయడం లేదని దాని వలన తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారని తద్వారా ఒక్కొక్క రైతు క్వింటాలకు 500 రూపాయలు ఎకరాకు 10 నుండి 15వేల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులను ప్రైవేటు వ్యాపారస్తుల దోపిడీకి సహకరిస్తుందని అన్నారు. రైతు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అలాగే రైతు భరోసా, పనిముట్ల కొనుగోలు సబ్సిడీ, కనీస మద్దతు ధర అన్ని విషయాలలో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో దుర్గం మారుతి, దేవేందర్ రావు, హరికుమార్ గౌడ్, బ్రహ్మం, ఆనంద్, కిషోర్, తిరుపతి, జితేందర్, నరహరి, సత్యనారాయణ, పబ్బ తిరుపతి పాల్గొన్నారు.