చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూంధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తుండగా, గోపీమోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను కథానాయిక హెబ్బా పటేల్ మీడియాతో పంచుకుంది. “ఈ మధ్య నేను అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నా.
‘ధూంధాం’ లాంటి సినిమా చేసి చాలా కాలమవుతోంది. నాకు రిఫ్రెషింగ్‌గా ఉంటుందని ఓకే చెప్పా. ఇందులో నా క్యారెక్టర్ పేరు సుహానా. డబ్బున్న అమ్మాయి. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల కోరుకున్న వెకేషన్‌కు వెళ్తుంటుంది. అలా ఒక వెకేషన్లో హీరోను కలుస్తుంది. అక్కడే వారి స్నేహం, ప్రేమ మొదలవుతాయి. ఈ చిత్రంలో నటించడం నాకు కేక్ వాక్ లాంటి ఫీలింగ్ కలిగింది.
చేతన్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. మా ఇద్దరిలో ఎవరు జూనియరో, ఎవరు సీనియరో చూసుకోలేదు. యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా పర్ఫార్మ్ చేసేందుకే చూశాం. రామ్‌కుమార్‌కు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని పేరొ స్తుంది. సరదాగా మాట్లాడే సాయికిషోర్ నాకిష్టం. సినిమాలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులున్నారు. నాకు వారితో కాంబినేషన్ సీన్స్ లేవు.
ఒక్క మల్లెపూల టాక్సీ పాటలో వారందరితో కనిపిస్తా. నా లైఫ్‌లో ‘ధూంధాం’ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. బర్త్ డే, కొత్త సినిమా సైన్ చేసిన రోజు, నా సినిమా హిట్ టాక్ వచ్చిన రోజు.. ఇలా అన్నీ ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటా. నటిగా నాకు కెమెరా ముందు నిల్చున్న ప్రతి సందర్భమూ ఇష్టమే. సినిమా, వెబ్ సిరీస్, ఫొటోషూట్ ఏదైనా సరే ఎంజాయ్ చేస్తా” అని తెలిపింది.