03-04-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 2 ( విజయ క్రాంతి): సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ బడా వ్యాపారులకు దారా దత్తం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి. ప్రశ్నించిన ప్రజా సంఘాల నాయకులను విద్యార్థి నాయకులను నిర్బంధించడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రిన్స్ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వివాదాలు జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ HCU లో జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్న నాయకులను అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టాడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4 00 ఎకరాల పచ్చటి చెట్లను నరకకుండా అది యూనివర్సిటీలోనే భాగంగా ఉండే విధంగా చేయాలని బిజెపి తరఫున డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలొ కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ గా మారారు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూ యూనివర్సిటీ భూములను వదిలిపెట్టకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఇచ్చిన యూనివర్సిటీని ఈరోజు మీరే అమ్ముకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
ఇందిరాగాంధీ ఆశయాలను సాధించాలని అనుకునే నిజమైన కార్యకర్తలు అయితే యూనివర్సిటీ భూములను అమ్మకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, బీజేవైఎం పట్టణ శాఖ అధ్యక్షులు కాసుకుంట్ల రమేష్ కోటి, నాయకులు మంగు నరసింహారావు, బట్టు క్రాంతి, బూరుగు మణికంఠ, తీరాల శంకర్, గుర్రం ప్రవీణ్ రెడ్డి, కొల్లి చెలిమ మల్లికార్జున్ రత్నపురం ప్రవీణ్ బోడ సామి రావుల సంతోష్ కొత్త మహేందర్ నరాల రమేష్ బోనగిరి సిద్దు ముత్యాల సాయికిరణ్. బిజెపి నాయకులు చందా మహేందర్ గుప్తా, జనపల్లి శ్యాంసుందర్ రెడ్డి నీలం రమేష్, లక్ష్మీనారాయణ, కోటేష్ శ్రీశైలం కృష్ణ చారి సంతోష్ నాగరాజు రామకృష్ణ ఉషాకిరణ్ సురేష్ రెడ్డి నాగరాజు కుమార్ నరేష్ కొండల్ సతీష్ శివ సన్నీ నవీన్ ప్రేమ్ నర్సింగ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.