calender_icon.png 23 September, 2024 | 5:56 AM

తిరుమలకు పూర్వవైభవం తెస్తా..

23-09-2024 02:09:28 AM

ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గత ఐదేళ్లలో వైఎస్‌ఆర్ పార్టీ నేత లు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు విమర్శించారు. ప్రక్షాళన చేపట్టి తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఆదివారం తన నివాసంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2004లో క్లుమైర్ మైన్స్ దాడి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడారని, నాకు తిరుమల శ్రీవారంతటే చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి, నమ్మకం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని, ఇప్పటివరకు పాలకులెవరు తిరుమల పవిత్రతను దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. తిరుమల ప్రక్షాళన చేసేందుకు దేవుడు నాకు ఒక  అవకా శం ఇచ్చారని, శ్యామల రావుకు చెప్పి, అందుకనుంగా పనిచేయాలని ఈవోగా నియమించినట్టు తెలిపారు. 

లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే నాలుగు ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్‌ను ఎన్‌డీడీబీకి పంపామని, ల్యాబ్‌లో పరీక్షల తరువాత ఎస్ వాల్యుల్లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని వెల్లడించారు. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్‌లిస్టులో పెట్టారని, తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అక్రమాలపై ఐజీ, ఆపైస్దాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తామ ని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.