నగరంలో జరుగుతున్న వరుస ఘటనలు
తీవ్ర భయాందోళనలో తల్లిదండ్రులు
పోక్సో ఉన్నా ఫలితం అంతంతే..
కిండర్ గార్డెన్ వయసు నుంచే ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’పై అవగాహన కల్పించాలని కోరుతున్న విద్యావేత్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా నైతికత విషయంలో మాత్రం మనుషులు రోజురోజుకీ దిగజారిపోతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కామాం ధులు చిన్నారుల ను చిదిమేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకు పోయి వయసుతో సంబం ధం లేకుండా తమ కామవాంఛ కోసం అభం శుభం తెలి యని చిన్నారుల జీవితాలను నాశ నం చేస్తున్నారు.
చిన్నారుల కుటుంబీకులు, చుట్టుపక్కల నివసించే వారు, స్కూళ్లలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులతో ఇలా ప్రతిచోట ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొందరు యువత, సోషల్ మీడియా సహాయంతో బాలికలను టార్గెట్ చేసి, వారిని మత్తులోకి దింపి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు.
తాజాగా అమలులోకి వచ్చిన బీఎన్‌ఎస్ (భారతీయ న్యా య సంహిత) వీటికి పూర్తి భిన్నమైన శిక్షల నిబంధనలను కలిగి ఉంటుంద ని, ఘటనను బట్టి మరణశిక్ష విధించే అవకాశం కూ డా ఉందని న్యాయ నిపుణు లు సూచిస్తున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నా, మార్పు మాత్రం అనుకున్న మేర రావడం లేదనే చెప్పాలి. చిన్నారులకు కిండర్ గార్డెన్ వయస్సు నుంచే గుడ్ టచ్‌బె టచ్‌పైనా అవగాహన కల్పించాలని పలువురు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా చిన్నారులపై జరిగిన లైంగిక దాడులు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి.
కూతురిపై లైంగిక దాడికి యత్నం..
నీలి చిత్రాలు చూడడానికి అలవాటు పడిన ఓ కసాయి తండ్రి గత నెల 20వ తేదీన మియాపూర్‌లో తన కూతురు(13)పైనే లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
4 ఏళ్ల చిన్నారిపై..
ఎల్‌బీ నగర్ పీఎస్ పరిధిలో నివసిస్తున్న శ్రీకాంత్(28) అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉంటున్న చిన్నారి(4)పై కన్నేశాడు. బాత్రూం కోసమని వెళ్లిన చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన చిన్నారి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిగురించిన ప్రేమ..
ఆగాపురాకు చెందిన షేక్ అర్బాస్ (23) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత నెల 24న పాఠశాలకు వచ్చిన బాలికను తనతో పాటు తీసుకెళ్లి ఓ లాడ్జిలో బంధించి రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మైనర్ బాలికకు కానిస్టేబుల్ ప్రేమ పాఠాలు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్(30) తన కాలనీలోనే ఉంటున్న ఓ బాలికకు ప్రేమ పాఠాలు నేర్పి లైంగికంగా వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితం గా దిగిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. విసిగిపోయిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ ఇచ్చి..
అంబర్‌పేట పీఎస్ పరిధిలో ఉండే డేవిడ్ (30) అనే వ్యక్తి భార్య గర్భిణి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో తన పక్కింట్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(14)కు తరచూ చాక్లె ట్లు, కూల్‌డ్రింక్స్ ఇస్తూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని చర్యలకు తట్టుకోలేక గత బుధవారం ఆమె తల్లికి జరిగిన విష యం చెప్పింది. తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.