calender_icon.png 18 January, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తా

03-09-2024 01:33:26 AM

న్యూఢిల్లీ: తాను ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్నట్లు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. సైనా నెహ్వాల్ మాట్లా డుతూ.. ‘నా మోకాలు ఇబ్బంది పెడుతోంది. కీళ్ల నొప్పులు నన్ను బాధపెడుతున్నాయి. సరైన విధంగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నా. ఎనిమిదితొమ్మిది గంటల పాటు ప్రాక్టీస్ చేయలేకపోతే మ్యాచ్‌లు గెలవడం కష్టమే. చాంపియన్లతో మ్యాచెస్ గెలిచేందుకు కొద్ది పాటి సమయం ప్రాక్టీస్ సరిపోదు’ అని నెహ్వాల్ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపింది. 2012 ఒలింపిక్స్‌లో సైనా బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. 2010, 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకాలు కూడా కొల్లగొట్టింది.