calender_icon.png 21 April, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులు లేరనే సాకుతో అంగన్వాడీలు మూసేస్తారా?

11-04-2025 12:50:32 AM

అధికారులపై మంత్రి సీతక్క గుస్సా

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో 313 అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులు లేరనే సాకుతో మూసేయడాన్ని తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తప్పుబట్టారు. తమ ప్రభుత్వం చిన్నారులపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను అందుకోకపోవడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిన్నారులు లేని అంగన్వాడీలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిం చాలని, 30 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేరని,198 కేంద్రాల్లో ఐదులోపు, 586 కేంద్రాల్లో పదిలోపే చిన్నారులున్నారని తెలిపారు. ప్రతి సెంటర్‌లో కనీసం 20 మంది చిన్నారులు ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగులు ఇస్తామని, మంచి గ్రేడింగు వస్తే అవార్డులు ఇస్తామన్నారు. డీడబ్ల్యులతో మే మొదటి వారంలో చింతన్ శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.