బాలీవుడ్ భామ ఆదా శర్మ మంచి జోష్ మీదుంది. వరుసబెట్టి సినిమాలు చేసేస్తోంది. కేరళ స్టోరీ, బస్తర్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో అమ్మడిని అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఆమె నటించిన వెబ్ సిరీస్ ’రీటా సన్యల్’ సోమవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదా ఆసక్తికర విషయాలు తెలిపింది.
"ది కేరళ స్టోరీ’ మంచి విజయం నమోదు చేసుకుంది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను వరుస ఫెయిల్యూర్స్ కారణంగా తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ది కేరళ స్టోరీ చిత్రం అవకాశం నా వద్దకు వచ్చింది. కథపై ఎంతో పట్టు సాధించాను. అవసరమైతే ఒక పుస్తకం కూడా రాయగలను” అని ఆదా చెప్పింది.