- రేవంత్‌కు సహాయకుడిగా బండి
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : రాష్ర్టంలో 11 నెలలుగా ఆటవిక పాలన నడుస్తోందని, రేవంత్ అన్ని వర్గాలను మోసం చేసి అధికా రంలోకి వచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి తన మార్క్ ను చూపలేదని.. అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావుపై బురద చల్లుతూ.. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చడానికి కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు.
రాష్ర్టం లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. బండి సంజయ్ రేవంత్‌రెడ్డి సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్, సంజయ్‌ది ఆర్‌ఎస్ బ్రదర్స్‌లా పని చేస్తున్నారన్నారు. ఎంపీ డీకే అరుణను లగచర్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నా సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.