19-03-2025 10:50:20 PM
సిర్పూర్: మండల కేంద్రంలో ఇద్దరు మహిళలపై అడవి పంది దాడి చేసింది. బాధితులు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మహిళలు ప్రతిరోజూ లాగే లేచి ఇంటి ముందు పనులు చేసుకుంటున్నారు. కాగా పక్కన ఉన్న చేండ్ల నుండి ఓ అడవి పందిని కుక్కలు తరుమాయి, దీంతో అడవి పంది ఎటో పారిపోవాలో తెలియక వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది కొందరు మహిళలు దాన్ని చూసి భయంతో కేకలు వేశారు. దీంతో మరింత భయపడి పోయిన పంది ఇద్దరి మహిళలపై దాడి చేసి గాయపరిచింది. చుట్టుపక్కల వారు గమనించి దానిని తరిమి వేయడంతో మహిళలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అదిలాబాద్ రిమ్స్ కు కుటుంబ సభ్యులు తరలించారు.