ఖమ్మం, జనవరి 29 (విజయక్రాంతి): ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం భార్య కుటుంబంతో సహా అతని ఇంటి ముందు ధర్నా నిర్వహించిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
అదే మండలం కలకోట గ్రామానికి చెందిన చవల పూజిత, బ్రాహ్మణపల్లికి చెందిన మడుపల్లి గోపీకృష్ణ ప్రేమిం పెళ్లికి గోపీకృష్ణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏడాది క్రితం ఖమ్మంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో తాను చేస్తున్న ఉద్యోగానికి గోపీకృష్ణ తిరిగి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి తిరిగి రాలేదు. పూజిత ఫోన్ చేసినా స్పందించడంలేదు. దీంతో బుధవారం బ్రాహ్మణపల్లిలోని భర్త ఇంటి ముందు పూజిత తన కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించింది. మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసి న్యాయం కోసం వచ్చానని, తన అత్తామామ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పూజిత తెలిపింది. న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పింది.