నిజామాబాద్, జూలై 3(విజయక్రాంతి): వేరే మహిళతో సహజీవనం చేస్తూ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి ఇంటి ఎదుట పిల్లలతో కలిసి భార్య ఆందోళనకు దిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన అరవింద్‌కుమార్ గత కొన్ని నెలలుగా తన భార్య, పిల్లలను విడిచిపెట్టి, వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విసిగిపోయిన అతడి భార్య సత్పూతే గిర్మాజీ అశ్విని తన అత్తింటి ఎదుట బుధవారం నిరసనకు దిగింది.
తనకు న్యాయం చేయాలం టూ పిల్లలతో కలిసి అత్తింటి వారిని డిమాండ్ చేసింది. అత్తింటివారే తన భర్తను మూడేళ్లుగా తమకు దూరంగా పెట్టారని ఆరోపించింది. మరో మహిళతో సహజీవనం చేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని అశ్విని తెలిపింది. తమకు న్యాయం చేయాలని, భర్త ఇంట్లో ఉండేందుకు తమను అనుమతించాలని అత్తింటివారిని కోరింది.