calender_icon.png 15 November, 2024 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను చంపిన భార్య..

11-11-2024 11:47:21 AM

మరిదితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని హతమార్చిన వైనం

నేరం తల్లిదండ్రుల మీదికి మోపేందుకు శతవిధాల యత్నం. 

తిమ్మాజీపేట మండలం రాళ్లచెరువు తండాలో ఘటన 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కలకాలం కలిసి ఉంటానంటూ ఏడడుగులు వేసిన అర్ధాంగి తన అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నాడని అర్థంతరంగా కట్టుకున్న భర్తను మరిది, అత్తతో కలిసి హతమార్చింది. తీరా ఆ నేరాన్ని తల్లిదండ్రుల మీదికే మోపేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైంది ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం రాళ్లచెరువు తండాలో శనివారం చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లచెరువు తండాకు చెందిన సభవత్ శీను(40) అదే గ్రామానికి చెందిన శాంతితో వివాహం జరిగింది. తల్లి జాంబ్రి, భార్య శాంతిలను రోజు తాగి వచ్చి చిత్రహింసలకు గురి చేసేవాడు.

ఈ నేపథ్యంలోనే శ్రీను తమ్ముడు సభావాత్ గోపాల్ తో భార్య శాంతి అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని మరిది, అత్త జాంబ్రితో పతకం వేసుకుంది. శనివారం రాత్రి శ్రీను ఇంట్లో నిద్రిస్తుండగా తలపై కర్రతో మోది తాడుతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం నింద వారి పైన పడకుండా శాంతి తల్లితండ్రులే చంపేశారని నమ్మించేందుకు ప్రయత్నించారు. శ్రీను మరణానంతరం మృతదేహాన్ని అదే గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంచేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం పూర్తిగా బయటపడింది. దీనిపై సంఘటన స్థలానికి ఎస్ఐ నరేందర్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.