ఒలింపిక్స్‌లో పతకం గెలిచి ఆనందంలో ఉన్న ఒక క్రీడాకారుడికి అతని భార్య సర్‌ప్రైజ్ ఇచ్చి మరింత ఉద్వేగానికి గురయ్యేలా చేసింది. విషయం లోకి వెళితే.. అమెరికా స్విమ్మర్ ర్యాన్ మర్ఫీ.. 100 మీ బ్యాక్‌స్ట్రోక్ విభాగం లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. విజేతలకు మెడల్స్ అందిస్తున్న తరుణంలో ర్యాన్.. స్టాండ్స్‌లో ఉన్న భార్య బ్రిడ్జెట్ వైపు చూశాడు. అప్పుడు ఆమె చేతిలో ఒక ప్లకార్డు గమనించా డు. ‘ర్యాన్.. మనకు అమ్మాయి పుట్టబోతోంది’ అని రాసి ఉంది. అది చది విన ర్యాన్ సంతోషంతో ఫోడియంపైనే ఎగిరి గంతేశాడు. దీనికి సంబం ధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.