నల్లగొండ, నవంబర్ 21 (విజయక్రాంతి): జిల్లాకేంద్రంలోని డీఈవో భిక్షపతి ఇంటి ఎదుట గురువారం ఆయన భార్య ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 ఏళ్ల క్రితం తనకు భిక్షపతితో వివాహమైందని, కొంతకాలం నుంచి తనను ఆయన పట్టించుకోవడం లేదన్నది. దీంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపింది. తన భర్త ఉద్దేశ్యపూర్వకంగానే వేరొక మహిళతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించింది.
ఇదే విషయంపై తనకు న్యాయం జరగాలని ఆందోళనకు దిగానన్నది. కోర్ట్‌లో విడాకుల కేసు నడుస్తుండగానే మరో మహిళతో కలిసి ఉంటున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ విషయంపై నల్లగొండ రెండో పట్టణ పోలీస్‌లు విచారణ సాగుతున్నట్లు వివరించింది.